కరీంనగర్ : దళిత బంధు పథకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే విపక్షాలు తప్పడు ప్రచారం చేస్తున్నాయని కరీంనగర్ నగర మేయర్ వై.సునీల్‌రావు అన్నారు. ఈ మేరకు ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ఈ పథకం అమలు అయితే తమ పార్టీలకు పుట్టగతులు ఉండవన్న భయంతోనే ఈ పథకాన్ని అడ్డుకొవటానికి బీజేపీ యత్నాలు చేస్తుందని ఆరోపించారు.
బండి సంజయ్ చేపట్టాల్సింది ప్రజా సంగ్రామ యాత్ర కాదని, దేశంలో బీజేపీ పాలిత సందర్శన యాత్ర చేయాలన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో పాదయాత్ర కన్న మందు ప్రజలకు బండి సంజయ్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.