Jayashankar Sir | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 21 : తెలంగాణ ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 14వ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదిన జంక్షన్ లో గల సర్ విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఉద్యమకారుల జేఏసీ జిల్లా అధ్యక్షురాలు ఎలుగు కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సర్ దేనని అన్నారు. ఉద్యమానికి ఆయన చేసిన సేవలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ రైతు సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు సామ వెంకటరెడ్డి, రవి కుమార్, విష్ణు,తదితరులు సర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టీయూజేఏసీ ప్రధాన కార్యదర్శి హసీనా బేగం, సహాయ కార్యదర్శి అమరగాణి మమత, కార్యదర్శి రిజ్వానా బేగం, సభ్యులు రాగిణీ, హర్షిత, శారద, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.