కలెక్టరేట్/కార్పొరేషన్/తెలంగాణచౌక్/ముకరంపుర/విద్యానగర్/వీణవంక/జమ్మికుంట/కరీంనగర్ రూరల్/చిగురుమామిడి/హుజూరాబాద్ రూరల్/ తిమ్మాపూర్, ఆగస్టు 6 : తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన వేడుకల్లో భాగంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్ పమేలా సత్పతి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు బలీయంగా కృషి చేసిన వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఈవో చైతన్య జైనీ, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేశారు. అనంతరం మదీన కాంప్లెక్స్ ఎదుట గల ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహియుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.
నగరంలోని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం.కిరణ్ పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో జయశంకర్ చిత్రపటానికి ఆర్ఎం రాజు, డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎంలు విజయమాధురి, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కొనియాడారు. నగరంలోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ కరీంనగర్ సరిల్ కార్యాలయంలో ఎస్ఈ మేక రమేశ్ బాబు జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఈలు కే ఉపేందర్, జంపాల రాజం, చంద్రమౌళి, ఎస్‌ఏవో రాజేంద్రప్రసాద్, ఏవోలు, ఏడీఈలతో పాటు మహిళా ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పోలీసు కమిషరేట్‌లో డీసీపీ వెంకటరమణ తదితర పోలీసు అధికారులు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీపీ ఏఆర్ భీంరావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు రజినీకాంత్, జానీ మియ, శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, కరీంనగర్ రూరల్ మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం, శంకరపట్నంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్‌కు నివాళులర్పించారు.