అబద్ధాలకు కేరాఫ్ అర్వింద్
‘అబద్ధాలకు ని జామాబాద్ ఎంపీ అర్వింద్ కేరాఫ్‌గా మారిండు. అభివృద్ధిని మరిచి దుర్భాషలు, దూషణలనే తన విధానంగా మార్చుకున్నడు’ అంటూ జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- దుర్భాషలు, దూషణలే ఆయన విధానం
- అభివృద్ధిని మరిచి అనవసర రాద్ధాంతం
- భోగ శ్రావణికి పరామర్శతో తేటతెల్లమైన చీకటి ఒప్పందం
- జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ధ్వజం
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 11: ‘అబద్ధాలకు ని జామాబాద్ ఎంపీ అర్వింద్ కేరాఫ్‌గా మారిండు. అభివృద్ధిని మరిచి దుర్భాషలు, దూషణలనే తన విధానంగా మార్చుకున్నడు’ అంటూ జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగిత్యాల బల్దియా మాజీ చైర్పర్సన్ భోగ శ్రావణిని పరామర్శించడంతో వారి మధ్యన చీకటి ఒప్పందం తేటతెల్లమైందని మండిపడ్డారు. ఆయన తన పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల రూరల్, అర్బన్ మండల ఎంపీపీలు గాజర్ల గంగారాంగౌడ్, మ్యాదరి వనిత మరణించినా ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. బీజేపీలో చేరేందుకే శ్రావణి ఆత్మగౌరవం పేరిట బీఆర్ఎస్ను, ఎమ్మెల్యేను బద్నాం చేస్తున్నదని విమర్శించారు. జగిత్యాలలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దావ వసంత మాట్లాడారు. నిత్యం అసత్యాలు చెప్పే అర్వింద్‌కు నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసిన జరిగిన అభివృద్ధి కనిపించకపోవడం శోచనీయమన్నారు. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కంటివెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకుని కండ్లద్దాలు తీసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే సంజయ్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఒర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆయనపై మతి భ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వారు మానసిక పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఎంపీ అర్వింద్‌కు లేదన్నారు. ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవితపై ఇష్టానుసారం మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజాసమస్యలపై గళమెత్తిన నాయకురాలు, మాజీ ఉత్తమ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో 25 కోట్లతో జగిత్యాల పట్టణ అభివృద్ధి, 70 కోట్లతో బోర్నపెల్లి వంతెన, మాతా శిశు సంరక్షణ కేంద్రం, అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని తెలిపారు. దొంగ హామీలిచ్చి నెరవేర్చని అర్వింద్ ఆమెపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్క కాలేజీని కూడా ఎందుకు తీసుకురాలేదని అర్వింద్‌ను నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. స్థానికులకు 90శాతం ఉద్యోగాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అదానీ చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రధాని మోదీ చాయ్‌లాగా ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేతకాని దద్దమ్మలని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్లో నియోజకవర్గాల అభివృద్ధికి నిధు లు మంజూరు చేయించలేని అసమర్థులని దు య్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పా రు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు తోట మల్లికార్జున్, బండారి రజిని, అడువాల జ్యోతి, సమిం డ్ల వాణి, బొడ్ల జగదీశ్వర్, అల్లె గంగాసాగర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, ప్రధాన కార్యదర్శి ఆనంద రావు, నాయకులు బాలె శంకర్, బండారి నరేందర్, దుమాల రాజ్‌కుమార్, సమిండ్ల శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్ , స్థానిక బీఆర్ఎస్ నాయ కులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

