చిగురుమామిడి, సెప్టెంబర్ 30 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఎన్నికల్లో గ్రామానికి చెందిన జక్కుల బాబు ఏకగ్రీవంగా రెండవసారి ఎన్నికయ్యాడు. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ తెలంగాణ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు నిర్వహించగా, ఎన్నికల అధికారిగా జూనియర్ ఇన్స్పెక్టర్ ఏ.లత ఆధ్వర్యంలో నిర్వహించారు.
నియామక పత్రాన్ని గ్రామంలోని పెద్దమ్మ గుడి ఆవరణలో జక్కుల బాబుకు అందజేశారు. ఉపాధ్యక్షుడిగా నాగుల రాజేందర్, కార్యదర్శి జక్కుల మల్లేష్, డైరెక్టర్లుగా జక్కుల స్వామి, దుర్ముట్ల కనకయ్య, జక్కుల రవి, జక్కుల కనకయ్య, యాట వెంకటయ్య, యాట రాజయ్య, ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికైన జక్కుల బాబుకు గ్రామ మాజీ సర్పంచ్ జక్కుల రవీందర్ శాలువాతో ఘనంగా సత్కరించారు.