Karimnagar | కార్పొరేషన్, ఏప్రిల్ 5 : సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని సమతా వాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అన్నారు. ఆయన 118వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తా లోని వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, బీఆర్ఎస్ కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బీఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు షౌకత్, నగర యూత్ ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయి కృష్ణ, డివిజన్ అధ్యక్షులు అరె రవి గౌడ్, చేతి చంద్రశేఖర్, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్, నాయకులు కర్ర సూర్య, శేఖర్, బొగ్గుల మల్లేశం, గంటల రేణుక, నాగుల కిరణ్ కుమార్ గౌడ్, పబ్బతి శ్రీనివాస రెడ్డి, నయీమ్, నిజాం, నదీమ్, సుధీర్ తదితరులు పాల్గన్నారు.