జగిత్యాల కలెక్టరేట్, జనవరి 3 : నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. ఈ మాంజాతో మనుషులు, పక్షులకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. దీనిపై అందరికీ అవగాహన ఉండాలని సూచించారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం చైనా మాంజా వినియోగం నిషేధించారని తెలిపారు. నైలాన్, సింథటిక్ దారాలు పక్షులు, పర్యవరణానికి, మనుషులకు హాని చేస్తాయని వివరించారు. చైనా మాంజా విక్రయాల నిరోధానికి, మాంజా వినియోగాన్ని నిలిపివేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా ఈ మాంజా విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.