జగిత్యాల రూరల్, అక్టోబర్ 22: ‘వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, ప్రతిపక్షా లు ఆగమైతున్నయి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాయి. వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలే. వాళ్లతో అయ్యేది లేదు. పోయేది లేదని’ జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. జగిత్యాల రూరల్ మండలం పొలాసకు చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీలో చేరగా, వారికి సంజయ్‌కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు.
దేశంలోనే అత్యధిక గురుకులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, మన గొల్లపల్లి రోడ్డులో ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, పథకాలకు ఆకర్శితులయ్యే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. పార్టీలోకి వచ్చిన వారు కొత్తపాత అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉండి పార్టీ అధికారంలో కి వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఇక్కడ ఎంపీపీ రాజేంధ్రప్రసాద్, మండలాధ్యక్షుడు బాల ముకుందం, గ్రామశాఖ అధ్యక్షులు రామ్‌శంకర్, మాజీ సర్పంచ్ నరేష్, ఏఎంసీ డైరెక్టర్ జైరాం సురేష్, ప్యా క్స్ డైరెక్టర్ పోచమల్లయ్య, నాయకులు రెంటం సత్యనారాయణ పాల్గొన్నారు.