Jagityal : జగిత్యాలకు చెందిన నికేశ్ (Nikesh) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఝాన్సీ రోడ్డు కాలనీకి చెందిన అతడు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 20 శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నికేశ్ మృతి చెందాడు. దాంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యాక్సిడెంట్ కారణంగా అతడు మరణించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.