జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మల్యాల మండలం రాజారాంపల్లి స్టేజ్ వద్ద బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. బైక్‌ను ఢీకొట్టిన ఆటో బోల్తా పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. అలాగే.. బైక్‌పై ప్రయాణిస్తున్న మల్యాల వాసి సంజీవ్ మృతి చెందాడు. మృతి చెందిన వలస కార్మికులను ఒడిశా వాసి సుధాకర్, ఛత్తీస్‌గఢ్ వాసి గోపాల్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.