Suicide | వెల్గటూర్, జూన్ 18 : ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చర్లపల్లి గ్రామానికి చెందిన పత్తిపాక సుధాకర్ (28) బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సుధాకర్‌ను జగిత్యాల దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుధాకర్‌కు ఇటీవలే వివాహమైంది. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సుధాకర్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్