జగిత్యాల : విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలి అని ప్రిన్సిపాల్ అరిగెల అశోక్ అన్నారు.
జగిత్యాలలోని ఎస్.కె.ఎన్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జాతీయ గ్రంథాలయ వారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పుస్తకం ఒక మంచి గురువు అన్నారు. గ్రంథాలయం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, జ్ఞానం పెంపొందించుకోవడానికి, భవిష్యత్తు నిర్మాణానికి ముఖ్య భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు గ్రంథాలయాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి అని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయం అందిస్తున్న N-LIST, OPAC, డిజిటల్ వనరులు, ఈ–జర్నల్స్, ఈ–బుక్స్ వంటి సేవలను గ్రంథాలయ విభాగ అధిపతి కొక్కుల సురేందర్ విద్యార్థులకు తెలియజేశారు. వారోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం కథారచన, ఎస్సే రైటింగ్, క్విజ్ వంటి వకృత్వ , పోటీలు నిర్వహించ చనున్నట్లు సురేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ శ్రీనివాస్, ఎన్సీసీ అధికారి లెఫ్ట్ నెంట్ డాక్టర్ పి రాజు, డాక్టర్ జి.వి.ఆర్ సాయి మధుకర్, అంకం గోవర్ధన్, కందుకూరి శ్రీనివాస్, డాక్టర్ మహేష్, ప్రమోద్, స్వరూప, దివ్య రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.