మల్లాపూర్, ఆగష్టు 19: జగిత్యా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా గోదావరి నది తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలోని గోదావరి నది వరద ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద ప్రవాహం ఎక్కవగా ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు గోదావరి నది వైపు వెళ్లవద్దని, ఏదైన గ్రామాల్లో ఇండ్లు శిథిలావస్థలో ఉంటే గ్రామాల్లో అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను వెళ్లాలని సూచించారు. ఇక్కడ తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎంపీడీఓ శశికుమార్ రెడ్డి, ఆర్ఐ రాజేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.