Korutla | కోరుట్ల, ఏప్రిల్ 24: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కోరుట్ల బంద్ ప్రశాంతంగా కొసాగింది. ఈ బందులో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని తమ దుకాణాలను మూసివేసి సంఘీభావం ప్రకటించారు. అమాయకులైన పర్యాటకులను ముష్కరులు లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడడం హేయనీయమైన చర్యని నాయకులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.