Muthyampet | మల్లాపూర్, జూలై 12 : మల్లాపూర్ మండంలోని ముత్యంపేట గ్రామంలో లయన్స్ క్లబ్, మెట్పల్లి పట్టణానికి చెందిన మైత్రి ఆసుపత్రి సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఉచిత గుండె మెగా వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామంతో పాటు, చుట్టు గ్రామాలకు చెందిన సుమారు 150 మంది రోగులకు గుండెకు సంబదించిన పరీక్షలను నిర్వహించడంతో పాటు, ఉచితంగా మందులను పంపీణీ చేశారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేవెల్లి తిరుపతి మాట్లాడుతూ గ్రామాల్లో లయన కబ్ చేస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇక్కడ జిల్లా ఉప గవర్నర్ గుంటుక చంద్రప్రకాష్, కార్యదర్శి మండ స్వామి, కోశాధికారి కల్లెం నాగిరెడ్డి, సర్పంచ్ తేలు నరేష్, వీడీసీ అధ్యక్షుడు మర్రిపల్లి ప్రసాద్, జోనల్ చైర్మన్ గంగాధర్, మెట్పల్లి అధ్యక్షుడు వెల్మల శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.