బెంగళూరు: ఒక డెలివరీ ఏజెంట్ మహిళ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. అర్జెంట్ అంటూ బాత్రూమ్లోకి వెళ్లాడు. బయటకు వచ్చిన అతడు తన ప్రైవేట్ పార్ట్‌ను ఆ మహిళకు చూపించాడు. బాధిత మహిళ దీనిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాపోయింది. ఈ నేపథ్యలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Delivery man flashes at Woman) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంతరం మారతహళ్లి ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌కు ఆర్డర్ డెలివరీ కోసం ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ వెళ్లాడు. తనకు అర్జెంట్ అంటూ ఒక మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. బాత్రూమ్ వినియోగించుకుని బయటకు వచ్చిన అతడు తన ప్రైవేట్ పార్ట్‌ను ఆమెకు చూపించాడు. ఆ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఆ మహిళ ఈ సంఘటనను రికార్డ్ చేసింది. ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. బాధిత మహిళతో పోలీసులు మాట్లాడి ఫిర్యాదు తీసుకున్నారు. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను 22 ఏళ్ల విజయ్ మల్లికార్జున్ కామత్‌గా గుర్తించారు. ఆదివారం అతడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటనపై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. దీని పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆ డెలివరీ ఏజెంట్‌ను తొలగించినట్లు పేర్కొంది.
Horrifying incident in Bengaluru: A Flipkart/Myntra delivery agent forced his way into @nilofer_vlogs’ flat despite her clear refusals and exposed himself inside her home. This demands immediate police action!@BlrCityPolice pic.twitter.com/v15SwDscjE
— Gaurav Karan Chaudhary (@Gaurav_karan22) July 12, 2026