MLC Kavitha | వెల్గటూర్, మే 30 : వెల్గటూరు మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు అల్లం దేవక్క కుమారుడు శ్రీకాంత్ వివాహం ఇటీవల జరిగింది. కాగా నూతన జంటను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మాజీ చైర్మన్ దావ వసంత, ఇతర నాయకులు పాల్గొన్నారు.