MLA Sanjay Kumar | 23 మందికి స్వయంగా కంటి ఆపరేషస్లు చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గ పరిధిలోనీ 23 మంది నిరుపేదలకు ఆపి రోటరీ క్లబ్ మరియు జగిత్యాల పావని కంటి ఆసుపత్రి అధ్వర్యంలో ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని శస్త్రచికిత్సలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 23 మంది నిరుపేదలకు నేత్ర శస్త్ర చికిత్సలు చేయటం చాలా ఆనందంగా ఉన్నదని, ప్రపంచం మొత్తం ఉన్న అంధులలో భారత దేశంలోనే సగం మంది ఉన్నారని, రాష్ట్రంలో సైతం కంటి సమస్యలతో ఇబ్బందిపడే వారు అధికంగా ఉన్నారని చెప్పారు. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ‘‘కంటి వెలుగు’’ వంటి గొప్ప కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో మూడున్నర కోట్ల వరకు పరీక్షలు నిర్వహించారని, ఆపై అవసరమయిన వారికి కళ్ళ అద్దాలు అందజేశారనీ చెప్పారు.

పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. తాను 23 మందికి ఉచిత శస్త్ర చికిత్స చేయటం జరిగిందని, అందరికీ కంటి చూపు వచ్చిందని వెల్లడించారు. అలాగే కళ్ళు చాలా సున్నితమని, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని పేషెంట్లకు సూచించారు.
ఈ సందర్భంగా ఉచితంగా నేత్ర శస్త్ర చికిత్స చేసిన ఎమ్మెల్యేకు పేషంట్స్, వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా.విజయ్, జెడ్పీటీసీ మహేష్, కౌన్సిలర్ల పాంబాల రామ్ కుమార్, తోట మల్లికార్జున్, వైస్ ఎంపీపీ సురేందర్, సారంగాపూర్ మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, బీర్పుర్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు, సర్పంచ్ శ్రీపతి రమేష్, యూత్ పట్టణ ప్రధాన కార్యదర్శి శరత్ రావు, నాయకులు బాగోజి ముఖేష్ ఖన్నా, వంశీ, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
Ramayana | ‘రామాయణ’ రెండో ట్రైలర్ దసరాకేనా.. అక్టోబర్ 20న మరో భారీ అప్డేట్!
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

