Korutla | అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలపై నిలదీసిన ఎమ్మెల్యే సంజయ్
అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజా సమస్యలను ప్రస్తావించారు.
కోరుట్ల, మార్చి 18: అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజా సమస్యలను ప్రస్తావించారు. కోరుట్ల, నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్పల్లి ఆసుపత్రి దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కోరుట్ల ప్రభుత్వ దవాఖానలో గత రెండున్నర సంవత్సరాలుగా ప్రాథమిక వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉందని సభ దృష్టికి తీసుకువచ్చరు.
ఎమ్మెల్యే పలు దఫాలుగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకోవడం లేదన్నారు. ఈఎన్టీ సర్జన్, జనరల్ సర్జన్ అందుబాటులో ఉన్నప్పటికి దవాఖానలో అవసరమైన వైద్య పరికరాలు లేకపోవడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని తెలిపారు. వెంటనే అవసరమైన పరికరాలను సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. హాస్పిటల్ కోసం కొత్త భవనం నిర్మాణం 90 శాతం పూర్తి అయినప్పటికీ, చిన్నపాటి పనులు మిగిలి ఉండటంతో ప్రజలకు ఉపయోగంలోకి రాలేదని తెలిపారు. దవాఖాన దుస్థితిపై పూర్తి వివరాలతో రిపోర్ట్ తీసుకుని వెంటనే మిగిలిన పనులను పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

