CM relief fund | సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అందజేశారు. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 75 మంది లబ్ధిదారులకు చెక్కులిచ్చారు. ఈ చెక్కుల విలువ రూ.17. 23 లక్షల వరకు ఉన్నది. జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఈ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నదన్నారు. కంటి వెలుగును ప్రభుత్వం మరోసారి చేపట్టిందని చెప్పారు. గ్రామాల్లో సైతం వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బాలముకుందం, పీఏసీఎస్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జాన్, హెచ్సీఏ జిల్లా మెంబర్ దావా సురేష్,
ఆత్మ ఛైర్మెన్ రాజిరెడ్డితోపాటు పలువురు సర్పంచులు, ఎంపిటీసీ సభ్యులు,ఉప సర్పంచ్లు, ప్రజాప్రతినిదులు, నాయకులు పాల్గొన్నారు.