మెక్సికో సిటీ : ఫుట్‌బాల్ వరల్డ్‌కప్(FIFA World Cup) ఫస్ట్ మ్యాచ్‌లోనే సంచలనాలు నమోదు అయ్యాయి. గ్రూప్ ఏలో ఆతిధ్య దేశం మెక్సికో తన తొలి గేమ్‌లో 2-0 తేడా గోల్స్‌తో దక్షిణాఫ్రికాపై విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లకు రెడ్ కార్డ్ జారీ చేశారు. బ్రెజిల్‌కు చెందిన రిఫరీ విల్టన్ సాంపాయో ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వై. సిథోల్, టీ జ్వానేతో పాటు మెక్సికో ప్లేయర్ సీ మోంటిస్కు రెడ్ కార్డ్ ఇచ్చారు. దీంతో ఈ ముగ్గురు ఆటగాళ్లు గేమ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అట్టహాసంగా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ప్రారంభం వేడుకలు జరిగాయి. అయితే తొలి మ్యాచ్‌లో తొలి గోల్‌ను మెక్సికో ప్లేయర్ జే క్విన్నోస్ చేశారు. అతను ఆట 9వ నిమిషంలో గోల్ కొట్టి మెక్సికోకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో ఆర్ జిమినేజ్ 67వ నిమిషంలో గోల్ చేసి జట్టుకు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. తీవ్రంగా పోరాడిన దక్షిణాఫ్రికా గోల్స్ చేయలేకపోయింది. ఓ దశలో కేవలం 9 మంది ఆటగాళ్లతో మాత్రమే ఆడింది.
Quiñones scores. #FIFAFanFestival Mexico erupts 🇲🇽#FIFAWorldCup pic.twitter.com/Xt4ePzxUHO
— FIFA World Cup (@FIFAWorldCup) June 12, 2026
2022లో ఖతార్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో కేవలం నలుగురు ఆటగాళ్లకు మాత్రమే రెడ్ కార్డ్స్ ఇచ్చారు. కానీ ఈసారి టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ముగ్గురు ఆటగాళ్లకు రెడ్‌కార్డ్ ఇవ్వడం చర్చాంశంగా మారింది. మెక్సికో దేశం మూడోసారి సాకర్ వరల్డ్‌కప్‌ను నిర్వహిస్తోంది ఈసారి కూడా అద్భుతమైన రీతిలో ప్రారంభోత్సవం సాగింది. గతంలో 1970, 1986 సంవత్సరాల్లో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహించింది. మెక్సికో సిటీలోని ఫేమస్ అజ్టెకా స్టేడియంలోనే ఆ గేమ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.
ప్రారంభోత్సవంలో షకీరా తన పర్ఫార్మెన్స్తో అలరించింది. ఓపెనింగ్ సెర్మనీలో ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఓ రకంగా మెక్సికోలో కార్నివల్ ఉత్సవ వాతావరణం నెలకొన్నది. ప్రస్తుతం ర్యాంకుల్లో మెక్సికో 14వ స్థానంలో ఉంది. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.