Amulya Sri | బాత్ రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్.. కామాంధుల వేధింపులకు బలైన షార్ట్ ఫిల్మ్ నటి
Amulya Sri | సినీ రంగంలో హీరోయిన్గా ఎదగాలనే కలలతో నగరానికి వచ్చిన యువ నటి అమూల్య శ్రీ జీవితం విషాదాంతమైంది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, కొందరు కామాంధుల వేధింపులు, బ్లాక్మెయిల్ కారణంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది.
Amulya Sri | సినీ రంగంలో హీరోయిన్గా ఎదగాలనే కలలతో నగరానికి వచ్చిన యువ నటి అమూల్య శ్రీ జీవితం విషాదాంతమైంది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, కొందరు కామాంధుల వేధింపులు, బ్లాక్మెయిల్ కారణంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. అందమైన నటన, ప్రతిభతో షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమూల్య శ్రీ, భవిష్యత్తులో సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలని కష్టపడుతున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే కొందరు వ్యక్తులు ఆమె జీవితాన్ని నరకప్రాయంగా మార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమాచారం ప్రకారం, నిందితులు అమూల్య శ్రీకి సంబంధించిన బాత్రూం వీడియోలను రహస్యంగా చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని గత ఆరు నెలలుగా ఆమెను తీవ్రంగా బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. తమ కోరికలను తీర్చాలని, లేదంటే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులతో అమూల్య తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో అమూల్య శ్రీ నిందితుల వేధింపులను తట్టుకోలేక పోలీసులను కూడా ఆశ్రయించినట్లు సమాచారం. తనకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో కొంతకాలం వేచి చూసిన ఆమె, చివరకు తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అమూల్య మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఆమె తల్లి కన్నీరుమున్నీరవుతూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన కుమార్తె మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఘటన జరిగి దాదాపు పది రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోందని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ కేసులో నలుగురు యువకులతో పాటు ఒక యువతి కూడా ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెలువడుతోంది. అయితే పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

