జగిత్యాల, మార్చి 04 : రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లను ప్రోగ్రాం ఆఫీసర్, మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి స్పెషల్ డ్రైవ్ లో బాగంగా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్లలోని రికార్డులను,స్కానింగ్ యంత్రాన్ని పరిశీలించారు. ఫారం ఎఫ్ నివేదికలు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
ప్రతి నెల 5 లోపు మోతేవాడలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫారమ్ ఎఫ్ లు సబ్మిట్ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డేకాయ్ ఆపరేషన్ కమిటీ సభ్యులు గైనకాలజిస్ట్ డాక్టర్ సాయి సుధా, సఖి కోఆర్డినేటర్ లావణ్య, అశ్విని, హెల్త్ ఎడ్యుకేటర్లు భూమేశ్వర్, తరాల శంకర్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాజేశం, ఆరోగ్య పర్యవేక్షకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.