జగిత్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి జయంతిని ఘనంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆదివారం కొండగట్టు ఆలయ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మోల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ..ఆంజనేయ స్వామి వారి జయంతులను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. రానున్న రోజుల్లో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.