పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన యువకుడు కొలపురి చంద్రశేఖర్ (Kolapuri Chandrashekar) డాక్టరేట్ పట్టా సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 84వ స్నాతకోత్సవంలో మంగళవారం ఇస్రో (ISRO) చైర్మన్ డా. నారాయణ్ (Narayanan) చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు చంద్రశేఖర్.
పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో “భారత్ రాజకీయాలు- ఎన్నికల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొత్త విధానాలు”పై చేసిన పరిశోధనకుగానూ ఆయనకు పీహెచ్డీ పట్టా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్ర గవర్నర్ రాధకృష్ణన్, వైస్ ఛాన్సలర్ కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాసీం సార్, పాలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ కృష్ణ కుమార్ , శ్రీలత , చల్లమల వెంకటేశ్వర్లు , మాజీ యూజీసీ డీన్ గడ్డం మల్లేశం పాల్గొన్నారు.