KCR | జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ స్లలానికి కేసీఆర్ హెలికాప్టర్లో ల్యాండయ్యారు. హెలికాప్టర్లో నుంచి దిగుతూ అభిమానులు, ప్రజలకు విక్టరీ సింబల్ చూపిస్తూ అభివాదం తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఇతర బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్‌కు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. కేసీఆర్ అభివాదంతో కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం రెట్టింపైంది. తమ అభిమాన నేత హెలికాప్టర్లో దిగుతుండగా తమ సెల్ఫోన్లలో బంధించారు. అభివాదం చేస్తున్న కేసీఆర్‌ను ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు.
కేసీఆర్ సభకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. వివిధ మండలాలు, గ్రామాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వెళ్లారు. ఆయా గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షుడు, ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఊపి వాహనాలను ప్రారంభించారు. జగిత్యాలకు వెళ్లే వాహనాల దండుతో రోడ్లన్నీ గులాబీ మయంగా మారాయి. ‘జై తెలంగాణ, జై కేసీఆర్, రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి..’ వంటి నినాదాలతో రహదారులు దద్దరిల్లాయి.



Valmiki Ramayana | ఆధ్యాత్మిక కలయిక.. ‘వాల్మీకి రామాయణం’ కోసం జతకట్టిన ఇళయరాజా!
Mahavatar Parshuraam | ధర్మ రక్షణ కోసం పరశురాముడి ఆగమనం.. ‘మహావతార్ పరశురామ్’ మోషన్ పోస్టర్ రిలీజ్