ఎండపల్లి: జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామంలో మంగళవారం రాత్రి పొలం పనులు చేయిస్తుండగా ముడిమడుగుల పోచయ్య అనే రైతు ట్రాక్టర్ వీల్స్ (కేజీ వీల్స్) కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అది ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న మరణమా, లేదంటే ఎవరైనా హత్య చేశారా..? అని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. పోచయ్య కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.