గ్రామాల రూపురేఖలు మారినయ్
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ, ప్రణాళికతో రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్లలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
- పల్లె ప్రగతితో అద్భుత ఫలితాలు
- మంత్రి కొప్పుల ఈశ్వర్
పెగడపల్లి, నవంబర్24: సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ, ప్రణాళికతో రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్లలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం ఎల్లాపూర్- ల్యాగలమర్రి గ్రామాల మధ్య ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతినగా గురువారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా దారి మరమ్మతు పనులు త్వరలో చేపట్టి రెండు గ్రామాల మధ్య రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పల్లెలు అభివృద్ది పథంలో దూసుకుపోతున్నాయనీ, ముఖ్యంగా పల్లెప్రగతి పథకంతో అద్భుతమైన అభివృద్ధి సాధించాయన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీల ఏర్పాటు, ట్రాక్టర్లు, ట్రాలీల కొనుగోలు, హరితహారం మొక్కలు నాటడం, డంప్‌యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రైతువేదికలు, ఇంటింటికీ చెత్త సేకరణ వంటి పనులతో పల్లెల రూపురేకలు పూర్తిగా మారాయన్నారు. అనంతరం లింగాపూర్‌కు చెందిన కానిస్టేబుల్ రమణాచారి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే గ్రామంలో పలు బాధిత కుటుంభాలను మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న, సర్పంచులు వనజ, లక్ష్మీ, ఎంపీటీసీలు రవీందర్, అంజయ్య, ఆర్బీఎస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మండల నాయకులు సురేందర్‌రెడ్డి, కరుణాకర్‌రావు, ఆనందం, ఆంజనేయులు, వీరేశం, శ్రీనివాస్‌గౌడ్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

