JAGITYAL | జగిత్యాల, ఏప్రిల్ 09 : ప్రజల తీర్పు, కార్య కార్యకర్తల శ్రమను లెక్కచేయకుండా ఒక పార్టీనుంచి గెలిచి స్వలాభం కోసం మరో పార్టీలోకి జంప్ అయిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీకు దమ్ముంటే రాజీనామా చేసి ప్రజల తీర్పును కోరాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ భోగ శ్రావణి సవాల్ విసిరారు.
జగిత్యాల కమల నిలయంలో బోగ శ్రావణి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీవన్ రెడ్డి టీడీపీకి, మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని శ్రావణి తెలిపారు. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవికి, అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష బీజేపీలో తాను గౌరవప్రదంగా చేరాననీ శ్రావణి గుర్తు చేశారు. మరి మీరు దొంగ రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారనీ చెబుతూ కార్యకర్తలు, నాయకులకు చెప్పకుండా బీఆర్ఎస్ ను విడడం న్యాయమేనా అని ప్రశ్నించారు.
నమ్మిన వారి ఆత్మ గౌరవాన్ని పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టిన సంజయ్ కుమార్‌ది తెరిచినా పుస్తకం కాదు రాక్షస పాలన అంటూ ఎమ్మెల్యే తీరుపై శ్రావణి మండిపడ్డారు. జగిత్యాలలో కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మీతోనే సాధ్యమన్నారు. 2017లో భూమి పూజ చేసిన డబుల్ ఇల్లు ఇప్పటివరకు పూర్తికాలేదనీ, మీ బంధువులే కదా కాంట్రాక్టర్లు ఎందుకు చేయలేదో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ లో ఏ పార్టీ నుండి టికెట్ తెచ్చుకుంటావో, నేను బిజెపి తరపున నిలుచుంటా, పోటీ చేస్తా, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా అనీ ఆమె ఎమ్మెల్యే కు సవాల్ చేశారు.
ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్థాయి గురించి మాట్లాడినందుకు గాను శ్రావణి ఎమ్మెల్యేకు చురకలు అంటించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న, మహిళ మోర్చా ప్రదాన కార్యదర్శి సాంబరి కళావతి, మహిళ మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, పట్టణ ఉపాధ్యక్షులు పవన్ సింగ్, సింగం పద్మ, కాశెట్టి తిరుపతి, గడ్డల లక్ష్మి ఇట్యాల రాము, నాయకులు పాల్గొన్నారు.