MLA Kalvakuntla Sanjay | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కొంతకాలంగా ఆ పార్టీ వ్యవహారశైల్లిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసిందే. ఈ క్రమంలో ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరుతున్నారంటూ ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రంజాన్ ప్రార్థనల సందర్భంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, అనుచరులతో కలిసి కనిపించారు.
జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తున్నారా..? అనే విషయమై కోరుట్ల ఎమ్మెల్యే, డ్యాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తానంటే.. పొమ్మంటే నేను పోయి ఆయనను నా భుజాల మీద వేసుకుని వస్తానన్నారు. ఆయన అంత మంచి మనిషి. ఆయనంటే అంత గౌరవం నాకు. నేను సర్జన్‌గా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. వాళ్ల తమ్ముడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నేను ఓపీడీలోకి వెళ్తుంటే మా అందరికీ పక్కనే చైర్లు ఉంటాయి. ఆయన ఒక్కడే రోజు వచ్చి చేతులు కట్టుకుని వెనకాల కూర్చుంటుండే. ఎమ్మెల్యేలంటే ఎట్లుంటరు. ఎమ్మెల్యే కాదు పార్టీ ఇంఛార్జ్‌లే.. జీవితంలో ఒక్కసారి కూడా గెలువనోళ్లు కూడా ఇవాళ రేపు నాకు నలుగురు గన్మెన్లు కావాలంటున్నరు. అట్లాంటిది ఆయన ఒక్కరే వచ్చి ఇట్ల కూర్చుంటుండే. నాకు ఆయనంటే అంత గౌరవం. ఆయన దగ్గర అవినీతి అనే పదమే ఉండదు. అలాంటి వ్యక్తి మా పార్టీలోకి వస్తే ఆనందంగా స్వాగతిస్తా. మా జీవన్ రెడ్డి సాబ్ అంటే మాకంత గౌరవమన్నారు.
జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తే నేను భుజాల మీద మోసుకుని తీసుకొస్తాను
జీవన్ రెడ్డి అంత మంచి మనిషి – కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ https://t.co/fF5HRcMks5 pic.twitter.com/ZawIMQKNcr
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2026
బీఆర్ఎస్తోనే మైనారిటీల సంక్షేమం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్