జగిత్యాల మార్చి 23: వృద్ధుల సంరక్షణ, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం వృద్ధుల సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆదివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరాదరణకు గురవుతున్న వృద్ధుల హక్కులు, సమాజ హితానికి వారి నైపుణ్యాలను ఉపయోగించు కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ ఏర్పాటు చేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. 2019 లో కేంద్రప్రభుత్వం వృద్ధుల సంరక్షణ చట్టంలో చేసిన సవరణలను పార్లమెంట్లో ఆమోదించడానికి రాష్ట్రంలోని పార్లమెంట్ సభ్యులు రాజకీయాల కతీతంగా కృషి చేయాలని కోరారు.
వృద్ధుల సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం ప్రకటించిన విషయాన్ని వివరిస్తూ తమ అసోసియేషన్ తరపున హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు పి.హన్మంత్ రెడ్డి, ఎండీ యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు, జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్, కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, మెట్ పల్లి అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి, కార్యదర్శి సౌడాల కమలాకర్, కోశాధికారి వెలముల ప్రభాకర్ రావు, మల్యాల అధ్యక్షుడు ముదాం దేవరెడ్డి, గొల్లపల్లి అధ్యక్షుడు వీరారెడ్డి, ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్, కార్యదర్శి సౌదరి దుబ్బేశం, సారంగాపూర్ అధ్యక్షుడు కాలగిరి గంగ రెడ్డి, పాల్గొన్నారు.