మల్లాపూర్, జూన్,25 : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట కుస్తాపూర్ గ్రామానికి చెందిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. గత పది రోజుల నుండి ఒక వ్యవసాయ భూములకు సంబంధించి ఏర్పాటు చేసిన రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తినడంతో పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
రెండు ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో పది రోజుల నుండి పంటలకు నీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తము చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.