పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. పెగడపల్లి సహకార సంఘానికి సోమవారం 400 బస్తాలు రాగా, యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రైతుల ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్ బుక్కులు తీసుకొని, వరుస క్రమంలో సిబ్బంది రైతులకు బస్తాలు అందజేస్తున్నారు.
యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా బస్తాలు ఉన్నప్పటికిని ఇవ్వడం లేదని, ప్రభుత్వం స్పందించి యూరియా ఇబ్బందులు తొలగించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.