Jeevan Reddy | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కార్యకర్తల సమక్షంలో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ తన రాజీనామా లేఖను విడుదల చేశారు. పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదని.. జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వాపోయారు.
చాలా రోజులుగా నేను, నా కార్యకర్తలు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నామని తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నానని తెలియజేశారు. నాకు పార్టీలో గౌరవం లభించనప్పుడు ఖచ్చితంగా నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, దాని ప్రభావం ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుందంటూ ఇప్పటికే ప్రెస్మీట్లో వెల్లడించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి
కార్యకర్తల సమక్షంలో ప్రకటన
పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదు, జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదు
నేను, నా కార్యకర్తలు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాము… https://t.co/xvvcneowMQ pic.twitter.com/ls3WoiY9Ul
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2026