జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో గల పెగడపల్లి, గొల్లపల్లి, బుగ్గారం మండలాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎల్.ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత బాడీ ఫ్రీజర్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ.. నిరుపేదలకు బాడీ ఫ్రీజర్ ఎంతో అవసరమన్నారు. చాలామంది ఎవరైనా మరణించిన తర్వాత కడచూపు దక్కడం లేదని బాధపడుతుంటారు.
అలాంటి పేద ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎల్ ఎమ్ కొప్పుల, కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ ద్వారా వీటిని అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం కరోనా సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా సేవలందించిన ఆశ వర్కర్లు లను శాలువా తో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పిటిసిలు, ఎంపీపీలు, స్థానిక సర్పంచ్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.