Chigurumamidi | చిగురుమామిడి, డిసెంబర్ 14: పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం జరిగిన ఎన్నికల పోలింగ్ అధిక సంఖ్యలో ఓటింగ్ నమోదయింది. మండలంలోని 17 గ్రామాలకు గాను 85. 82 శాతం పోలింగ్ నమోదయ్యాయి. పలు గ్రామాల్లో ఉదయం 7 గంటల నుండి ఓటర్లు బార్లు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, వికలాంగులకు వీల్ చైర్ సౌకర్యాన్ని కల్పించి గ్రామపంచాయతీ సిబ్బంది ఓటు హక్కును వినియోగించేందుకు తీసుకెళ్లారు. పలు గ్రామాల్లో పోలీసులు అచ్యుత్సాహం ప్రదర్శించారు.
ఉల్లంపల్లి గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద పదో వార్డు అభ్యర్థి విజయ్ కుమార్ ను పోలీసు లాటితో కొట్టడంతో తీవ్ర ఉధృత నెలకొంది. చిన్న ముల్కనూరు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలసత్పతి పరిశీలించారు. ఓటింగ్ సరళిని పరిశీలించారు. రేకొండ గ్రామంలో సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. చిగురుమామిడి లో బిఆర్ఎస్ జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ కొత్త వినిత, కొత్త శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
సమస్యత్మక గ్రామాలను కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్, సిఐ లు బిళ్ళ కోటేశ్వర్, సదన్ కుమార్ స్థానిక ఎస్సై సాయి కృష్ణ తో కలసి పరిశీలించారు. గ్రామాల వారీగా ఓటింగ్ సరళిని పరిశీలించినట్లయితే బొమ్మనపల్లి 82, చిగురుమామిడి 84, గాగ్గిరెడ్డిపల్లి 88, గునుకులపల్లి 85, ఇందుర్తి 82, కొండాపూర్ 87, లంబాడి పల్లి 89, ముది మాణిక్యం 85, ముల్కనూర్ 87, నవాబుపేట 86,ఓగులాపూర్ 86, పీచుపల్లి 92, రామంచ 87, రేకొండ 85, సీతారాంపూర్ 90, సుందరగిరి 87, ఉల్లంపల్లి 86 శాతం ఓటింగ్ నమోదయింది. బరిలో ఉన్న అభ్యర్థులు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఓటు వేసుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలించారు.