జగిత్యాల, మార్చి 20 : విద్యార్థులు ఆరోగ్యాంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ చూపుతారని జగిత్యాల జిల్లా విద్యా శాఖాధికారి రాము అన్నారు. వరల్డ్ ఓరల్ హెల్త్ డే(World Oral Health Day) సందర్భంగా గురువారం ఇండియా డెంటల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఓల్డ్ హై స్కూల్ లో నిర్వహించిన ఉచిత దంత శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు. మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. తీపి, చల్లని పదార్థాలు, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ తీసుకుంటే దంతాలు పాడైతాయని అదేవిధంగా విద్యార్థుల దంతాలు శుభ్రంగా ఉండాలంటే౦ రోజు ఉదయం, రాత్రి బ్రష్ చేసుకోవాలని సూచించారు.
ఇండియా డెంటల్ అసోసియేషన్ బృందం ప్రభుత్వ పాఠశాలను ఎంచుకొని విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు చేసి బ్రష్లు, పేస్టులు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐడీఏ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, లక్ష్మీనారాయణ, కోశాధికారి శ్రీనివాస్, రాష్ట్ర ప్రతినిధి డాక్టర్. శైలేందర్ రెడ్డి, కళ్యాణ్, ప్రణీత్, సృజన, సోమేశ్వర్, మమతారెడ్డి, నందకిశోర్, రాజేందర్, రాజశేఖర్, నీలిమ, రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రకళ, బోయినిపెల్లి ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.