జగిత్యాల : జిల్లా కేంద్రంలోని ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మన గ్రోమోర్ దుకాణంలో ఎరువుల విక్రయాలకు సంబంధించినన రికార్డులను పరిశీలించారు. దుకాణం ముందు సూచిక బోర్డు తప్పనిసరి ఉంచాలని, సూచిక బోర్డుపై ఎరువుల మందులు, విత్తనాలు ధరల పట్టికలో ధరలు రాయాలని, రైతులకు సరైన ధరలకు అమ్మాలని సూచించారు. అదే విధంగా రైతులకు ఎరువులు విత్తనాలు నాణ్యతమైనవి అందించాలని, కాలం చెల్లిన (ఎక్స్ పైర్) మందులను రైతులకు అమ్మ రాదని పేర్కొన్నారు.
ఎరువులు, స్ప్రే మందులు సరైన ధరలకు అమ్మాలని కలెక్టర్ ఆదేశించారు. ఎకరానికి ఎంత ఎరువులు వేస్తున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన మందులు ఇస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. రైతులకు నాణ్యతలేని ఎరువులు మందులు విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్, మండల అధికారి ఏవో వినీల, తదితరులు పాల్గొన్నారు.