Jagtial : జగిత్యాల పట్టణ మేదరి సంఘం నూతన అధ్యక్షుడిగా చింత రమేష్ ఎన్నికయ్యారు. పట్టణ మేదరి సంఘం కార్యవర్గ ఎన్నికలు ఆదివారం స్థానిక హనుమాన్‌వాడలోని సంఘ భవనంలో నిర్వహించారు. అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా, చింత రమేష్‌కు అత్యధికంగా 128 ఓట్లు లభించాయి. చింత గంగారాంకు 79 ఓట్లు, చింత గంగాధర్‌కు 44 ఓట్లు రావడంతో సమీప ప్రత్యర్థిపై 49 ఓట్ల మెజారిటీతో చింత రమేష్ జగిత్యాల పట్టణ మేదరి సంఘం అధ్యక్షుడిగా విజయం సాధించారు. కనికరపు శ్రీనివాస్, చింత నరేష్, పిల్లి శ్రీనివాస్, చింత సంతోష్, చింత రాజమల్లు, మదిరే కృష్ణ చైతన్యలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.
మేదరి సంఘం ప్రధాన కార్యదర్శిగా కనికరం భీమయ్య ఎన్నికయ్యారు. ఈ పదవికి పోటీ చేసిన చింత రాజేశంపై భీమయ్య 40 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నూతన కార్యవర్గంలో కోశాధికారిగా చింత భీమయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రచార కార్యదర్శిగా బొమ్మిడి దశరధం, ఉపాధ్యక్షులుగా వేముల వంశీకృష్ణ, పిల్లి కిషన్ కుమార్, చింత సురేష్, వేముల సునీల్, పోతు కృష్ణ, మీడియా అధ్యక్షుడిగా చింత నరేష్, సహాయ కార్యదర్శులుగా చింత రాజు, వేముల రాజేష్, పోతు మహేష్, పట్టణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా గైని లచ్చన్న ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఊలే రాజన్న, సంగ గంగాధర్, పిల్లి బాలకృష్ణ, నాగురి హరీష్ తదితరులు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.
నూతన కార్యవర్గం ఎన్నిక పూర్తైన సందర్భంగా అధ్యక్షుడు చింత రమేష్ మాట్లాడుతూ.. మేదరి సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన సభ్యునికి అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి అందరి సహకారంతో ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. సంఘం ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ సభ్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ప్రధాన కార్యదర్శి కనికరం భీమయ్య తెలిపారు.
ఈ ఎన్నికలకు పర్యవేక్షణ అధికారులు చింత రాజనర్సు, చింత భీమయ్య, జిల్లా అధ్యక్షులు ఇందూరి గంగాధర్, గైని శ్రవణ్, గైని లచ్చన్న, పిల్లి బాలకృష్ణ, వేముల నర్సింగం, వేముల రాజేశం తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.