హుజూరాబాద్‌టౌన్, అక్టోబర్ 31: ఓటమి భయంతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, గడియారా లు, మేక పోతులు, చికెన్, మాంసాన్ని పంచింది ఈటల రాజేందరేనని ఆరోపించారు. 20 కంపెనీల పారామిలిటరీ బలగాలను రప్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది బీజేపీ నేతలు కాదా? అని ప్రశ్నించారు. ముమ్మాటికీ గెలుపు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్దేనన్నారు. ఈవీఎంలను తరలిస్తున్న బస్సు టైర్ పంక్చర్ అయితే అందులోని మిషన్లను మరో బస్సులో అధికారులు జాగ్రత్తగా తరలిస్తే అధికారులను తప్పుపట్టడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. దళితబంధుపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసి దళితులపై విషం కకే యత్నం చేసిందన్నారు. పెరిగిన పోలింగ్ శాతంతో టీఆర్ఎస్కు మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ప్రజ లు బీజేపీకి దిమ్మదిరిగే తీర్పును ఇవ్వబోతున్నారని తెలిపారు. గెలుపుపై బీజేపీ నాయకులకు నమ్మకముంటే పోలింగ్ బూత్‌ల వద్ద ఎందుకు గొడవలు చేశారో, ఎందుకు పోలింగ్‌ను అడ్డుకోవాలని చూశారో, టీఆర్ఎస్పై దుష్ప్రచారం ఎందు కు చేశారో ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. ఈటల తిన్నింటి వాసాలు లెకబెట్టాడని, టీఆర్ఎస్లో పదవులను అనుభవించి సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండీ రియాజ్, నాయకులు చందమల్ల బాబు, సంపంగి రాజేందర్, ఎస్కే ఫయాజ్, మోరె మధు పాల్గొన్నారు.