Jaggery seeds | సారంగాపూర్, మే 21: రైతులకు కావాల్సిన జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. బీర్ పూర్ మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం ఆవరణలో సహకార సంఘం అధ్యక్షుడు ముప్పాల రాంచందర్ రావు ఆధ్వర్యంలో రైతులకు బుధవారం జీలుగా విత్తనాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బీర్ పూర్ సహకార సంఘంలో జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నయని పట్టాదారు పాసుబుక్ తీసుకొని వచ్చి తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ తిరుపతి నాయక్, ఏఈఓలు శిరీష, వినోద్, సీఈఓ అయ్యోరీ తిరుపతి, పాలకవర్గ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.