Ashadam | తిమ్మాపూర్, జూన్30: ఆషాడం మాసం వచ్చింది. దీంతో గ్రామస్తులు, కుల సంఘాల ఆధ్వర్యంలో కలిసికట్టుగా వనభోజనాలకు కుటుంబాలతో వెళ్లి రోజంతా ఆనందంగా గడుపుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎల్ఎండీ రిజర్వాయర్ తీర ప్రాంతాల్లో పచ్చని ప్రకృతి నడుమ ఆనందంగా విహరిస్తున్నారు.
తిమ్మాపూర్ గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెల్పూరి విష్ణుమాచారి ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. రామకృష్ణ కాలనీ శివారులోని ఎల్ఎండీ రిజర్వాయర్ తీరంలో సమ్మక్క గద్దల వద్ద కులస్తులు అంతా కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు శ్రీనివాస్, రమేష్, సాంబయ్య, విశ్వనాథం, సదానందం, హనుమాన్లు, మహేష్, కులస్తులు పాల్గొన్నారు.