ముంచెత్తిన వాన
ఉదయం ఎండ..ఉక్కపోత ఉండగా మధ్యాహ్నం ఉన్నట్టుండి మేఘావృతమై వర్షం దంచికొట్టింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మోస్తారుగా, జగిత్యాల జిల్లాలో భారీగా కురిసింది.
- అత్యధికంగా బుర్దేశ్పల్లిలో 7.04 సెం.మీ నమోదు
- పెద్దపల్లి, రాజన్నసిరిసిల్లలో ఓ మోస్తారు వర్షం
- ఓదెల మండలంలో నేలకొరిగిన వరి
రాజన్నసిరిసిల్ల (నమస్తేతెలంగాణ), జగిత్యాల టౌ న్/ ఓదెల సెప్టెంబర్ 29: ఉదయం ఎండ..ఉక్కపోత ఉండగా మధ్యాహ్నం ఉన్నట్టుండి మేఘావృతమై వర్షం దంచికొట్టింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మోస్తారుగా, జగిత్యాల జిల్లాలో భారీగా కురిసింది. అత్యధికంగా ధర్మపురి మండలం బుర్దేష్పల్లిలో 7.4 సెంటీమీటర్లుగా రికార్డయింది. మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో 7.1 8 సెంమీ. జగిత్యాల రూరల్ మండలం పొలాసలో 6.8 సెంమీ వాన పడ్డది.
సిరిసిల్ల జిల్లాలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 వరకు ఏకధాటిగా కురిసింది. అత్యధికంగా ముస్తాబాద్ మండలంలో 16.3 మీ.మి నమోదైంది. ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో నిమజ్జనానికి అంతరాయం కలిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పొట్ట దశలో ఉన్న వరి నేలవాలింది.
వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొలనూర్లోని అప్పమయ్య చెరువు మత్తడి దుంకింది. కరీంనగర్ జిల్లాకేంద్రం, అల్గునూర్, కరీంనగర్ రూరల్ మండలంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పలుకాలనీల్లోకి వరదనీరు చేరింది. రాకపోకలకు అంతరాయం కలిగింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Cloudy Weather
- Heavy Rain
- pond
- rain
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

