Bandi Bhagirath | వేములవాడ, మే 12 : మైనర్ బాలికను వేధించిన నిందితుడు బండి భగీరథ్ ను కాంగ్రెస్ ప్రభుత్వమే కాపాడుతుందని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు ఆరోపించారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో మంగళవారం మాధవి రాజు విలేకరులతో మాట్లాడారు. స్నేహితులతో బెట్టింగ్ పెట్టి కట్టి మరి సామాజిక మాధ్యమాల ద్వారా యువతులను లొంగదీసుకునేందుకు భగీరథ్ వికృత క్రీడలు ఒక్కటి ఒక్కటిగా బయటపడుతున్నాయని మండిపడ్డారు. పుట్టుకలు పెంపకం గురించి మాట్లాడే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడిని ఎలా పెంచారో రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలిసిందని ఎద్దేవా చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులోకాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ వ్యవహారంలో మౌనం ఎందుకు పాటిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.
బాధితులు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ కేంద్రమంత్రి కుమారుడిని కాపాడుతున్న తీరు మీరు చీకటి రహస్యాన్ని ప్రజలకు అర్థమైందని మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయి రక్షణ మంత్రి కొడుకు వ్యవహారంలో మహిళా మంత్రులు, హోం మంత్రి వ్యవహరిస్తున్న తీరు ప్రజా క్షేత్రంలో ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. వెంటనే భగీరథ్‌ను పట్టుకునేందుకు పోలీసులు లుకవుట్ నోటీసులు జారీచేసి అరెస్టు చేసి కుటుంబానికి ధైర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో కౌన్సిలర్లు వెంగళ అనిత, మహిళా నాయకురాలు జంగిటి శ్రీనిధి, మామిండ్ల జమున, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, సిరిగిరి చందు, మారం కుమార్, గోలి మహేష్, కొండ కనుకయ్య, నీలం శేఖర్, అంజద్ పాషా, లైసెట్టి మల్లేశం, గూడూరు మధు, ఉల్లెందుల హనుమంతు, నిమ్మశెట్టి రాజు, గోసుకుల నరసయ్య, సంజీవ్, మంత సందీప్, సత్తిరెడ్డి, రాపెల్లి రాంబాబు, మామిండ్ల కనకయ్య, పెద్ది రాజు, పోతు అనిల్ కుమార్, రఫిక్, లింగం రాకేష్, అసద్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.