Dharmaram | ఎల్ఐసీలో కరీంనగర్ డివిజన్ టాపర్ గా నిలవడం అభినందనీయం.. కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజర్ పీ నాగశివప్రసాద్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఏజెంట్ ఇప్ప మల్లేశం ఎల్ఐసీ కరీంనగర్ డివిజన్ పరిధిలో అత్యధిక బీమా పాలసీలు చేసి టాపర్ గా నిలవడం ఎంతో అభినందనీయమని ఆ సంస్థ కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజర్ పీ నాగశివప్రసాద్ అన్నారు.
Dharmaram | ధర్మారం, మార్చి10 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఏజెంట్ ఇప్ప మల్లేశం ఎల్ఐసీ కరీంనగర్ డివిజన్ పరిధిలో అత్యధిక బీమా పాలసీలు చేసి టాపర్ గా నిలవడం ఎంతో అభినందనీయమని ఆ సంస్థ కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజర్ పీ నాగశివప్రసాద్ అన్నారు. మల్లేశం కరీంనగర్ డివిజన్ పరిధిలో గత 10 సంవత్సరాలుగా అద్భుతమైన బీమా పాలసీలు చేస్తూ మొదటి స్థానంలో నిలుస్తూ క్లబ్ గేలెక్సీ, ఎండీ ఆర్టీ స్థానంలో నిలవడం హర్షనీయమన్నారు.
అత్యంత ప్రధానమైన ఈ రెండింటిలో మల్లేశం అవార్డు పొందిన నేపథ్యంలో ఆయన సేవలను గుర్తించి స్వయంగా కరీంనగర్ నుంచి ధర్మారం మండల కేంద్రంలోని ఆయన ఇంటికి వచ్చి మల్లేశం ఆయన సతీమణి సరోజను డివిజనల్ మేనేజర్ శివనాగప్రసాద్ శాలువాతో సత్కరించి అభినందించారు.
ప్రత్యేక బహుమతిని ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ మేనేజర్ శివ నాగ ప్రసాద్ మాట్లాడుతూ మల్లేశం భవిష్యత్‌లో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ రవి నాయక్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అచ్యుత్ రావు, ఎల్ఐసీ అసోసియేట్ మంచాల వరప్రసాద్ తో పాటు ఎల్ఐసీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

