Chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 21 : ప్రభుత్వం గొర్ల పెంపకం దారుల సమస్యలతో పాటు సహకార సంఘాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం యూనియన్ చైర్మన్ భాషవేణి మల్లేశం యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో మండల ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం మండల అధ్యక్షుడు, జిల్లా డైరెక్టర్ ముక్కెర సదానందం యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గొల్ల కురుమలు కుటుంబాలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. జిల్లాలో ఉన్న గొర్ల కాపరుల సమస్యలు, సహకార సంఘాల సమస్యలు తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా పర్యటించనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో మాట్లాడి సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గతంలో గొర్ల కాపరులకు సంబంధించి నట్టల నివారణ మందులపై మంత్రి దృష్టికి తీసుకుపోతున్నట్లు వారు అన్నారు. రానున్న రోజుల్లో జిల్లా సహకార సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాసభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గొల్ల కురుమలు ఐక్యతతో అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి ముందు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ వైస్ చైర్మన్ చిగుర్ల శ్రీనివాస్ కురుమ, డైరెక్టర్లు అగిత రవీందర్, చందవేని ప్రసాద్ యాదవ్, కాల్వ సురేష్ యాదవ్, చౌటపల్లి రంజిత్ యాదవ్, జిల్లేల్ల పర్షరాములు యాదవ్, దాడి ఆంజనేయులు యాదవ్, బండి మల్లయ్య యాదవ్, కత్తల రమేష్ యాదవ్, స్థానిక గొల్ల కురుమ యాదవ సంఘం ఉపాధ్యక్షుడు మల్లేశం యాదవ్, ప్రధాన కార్యదర్శి అన్న సమ్మయ్య యాదవ్ కురుమ, డైరెక్టర్లు కాశవేణ ఓదెలు, చౌదరి మనోజ్ కుమార్, కాశవేణ రాజు, పోతన వేణి అనిల్, ముక్కెర మహేశ్వరి, చౌదరి లావణ్య, సంపత్, మర్రి రాజు, నరసన్న, కొండయ్య, సంపత్, అనిల్, శ్రీనివాస్, రవి కురుమ తదితరులు పాల్గొన్నారు.