Ramagundam | పని చేయని కాంట్రాక్టర్లకు నోటీసులివ్వండి.. అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ
అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలనీ, పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Ramagundam | కోల్ సిటీ, జూన్ 23 : అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలనీ, పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదన్నారు. క్షేత్ర స్థాయిలో పని పూర్తయిన తర్వాత సైట్ క్లియర్ చేసి రాకపోకలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చే అవకాశం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని అన్నారు. తగిన కారణం లేకుండా పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో నగర పాలక సంస్థ ఏఈ తేజస్విని, అన్వేష్, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

