Dharmaram | ధర్మారం, డిసెంబర్ 21 : పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గుంత భాస్కర్ పిరమిడ్ ప్రాంగణంలో ఆదివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. డిసెంబర్ 21ని పురస్కరించుకొని పిరమిడ్ స్పిరిచ్వల్ సొసైటీస్ మూవ్ మెంట్ (పీఎస్ఎస్ఎమ్ )మాస్టర్ గాగిరెడ్డి డిలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక ధ్యానం నిర్వహించారు. డిల్లేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ధ్యానం తో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు.
ప్రతీ ఒక్కరూ ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అభ్యాసకులో డిల్లేశ్వర్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ వ్యవస్థాపకుడు గుంత భాస్కర్, అభ్యాసకులు ఎలగందుల అశోక్, మామిడిశెట్టి శ్రీనివాస్, తాళ్లపల్లి సురేందర్ గౌడ్, ఉమాశంకర్,దేవి రాయలింగు, గౌడ శేఖర్, ఈగం ప్రసాద్, బీరెల్లి రాము, అమరపల్లి మల్లేశం, చిన్నబోయిన ప్రసాద్, తాళ్ల పెళ్లి ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.