Insurance cheque | తారుపల్లిలో బీమా చెక్కు అందజేత
ప్రతీ ఒక్కరూ బీమా చేసి ధీమాగా ఉండాలని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హుజూరాబాద్ డివిజనల్ మేనేజర్ కే సతీష్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి కి చెందిన సల్పాల బాలకృష్ణ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ.50వేల పాలసీ చేయించారు.
Insurance cheque | కాల్వ శ్రీరాంపూర్, జూలై 17 : ప్రతీ ఒక్కరూ బీమా చేసి ధీమాగా ఉండాలని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హుజూరాబాద్ డివిజనల్ మేనేజర్ కే సతీష్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి కి చెందిన సల్పాల బాలకృష్ణ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ.50వేల పాలసీ చేయించారు. ప్రమాదవశాత్తు జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలక్రిష్ణ మృతి చెందాడు. ఈ సందర్భంగా బీమా ద్వారా మంజూరు అయిన రూ.20,50000 వేల చెక్కు ను మృతుడి భార్య విజయ లక్ష్మికి శుక్రవారం మండల కేంద్రంలో అడ్వైజర్ అల్లంల రాజు, పలువురు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సతీష్ మాట్లాడారు. ఈ బీమా ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత అని అన్నారు. ఈ సమావేశంలో బిజినెస్ మేనేజర్ ఎస్ నాగేశ్వర్, లైఫ్ మిత్రలు కే శ్రీనివాస్, ఎం రాజశేఖర్, యూ సురేందర్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, సర్పంచులు బంగారి రమేశ్, తులా మనోహర్ రావు, రామచంద్రా రెడ్డి, గాజనవేన స్వరూప సదయ్య, కలవేన రమ రమేష్, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, ఏఎంసీ డైరెక్టర్ కలవేన రాజయ్య, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

