Garrepalli Model School | సుల్తానాబాద్ రూరల్, జనవరి 23 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్ వసంత పంచమి సందర్భంగా సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శుక్రవారం వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు.
వేదపండితులు గణపతి ఆరాధన చేసి, నవగ్రహ పూజ, పంచామృతలతో అభిషేకం, హోమం కార్యక్రమం నిర్వహించి తదనంతరం విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా సరస్వతీ మాత సమక్షంలో పూజించిన ప్యాడ్లు, పెన్నులు విద్యార్థులకు అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోల్డిబల్బీర్ కౌర్, ఉపాధ్యాయబృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.